‘అవును అక్కడ సర్జరీ చేయించుకున్నా’

శృతి హాసన్ బోల్డ్ గా మాట్లాడుతుంది. కొన్ని పర్సనల్ విషయాలు కూడా దాచే ప్రయత్నం చెయ్యదు. గతంలో తాను తెగ తాగేదాన్ని అని ఆ మధ్య వెల్లడించింది. ఆల్కహాల్ కి అడిక్ట్ కావడం వల్లే ఆరోగ్య సమస్యలు వచ్చి రెండేళ్లు సినిమాల్లో నటించలేదు అని చెప్పింది.

అలాగే ఇప్పుడు సర్జరీ గురించి చెప్పింది. అవును అందం కోసం కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నాను అని వెల్లడించింది. ఐతే, తాను కేవలం ముఖంపైనే సర్జరీ చేయించుకున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చింది. మిగతా అందాల కోసం కాదని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.

ఆమె ముక్కు మొదట్లో వేరేగా ఉండేది. ఇప్పుడు షార్ప్ గా ఉంటుంది. ముక్కు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది గతంలో. అలాగే ఇటీవల తన పెదాలు కూడా సరి చేయించుకుంది.

శృతి హాసన్ కిప్పుడు 35 ఏళ్ళు. ఇప్పుడు తెలుగులో మూడు సినిమాలల్లో నటిస్తోంది. బాలయ్య సరసన ఒక చిత్రం, మెగాస్టార్ చిరంజీవి సరసన మరోటి. ఈ రెండూ కాకుండా పాన్ ఇండియా చిత్రం ‘సలార్’లో ప్రభాస్ సరసన కూడా నటిస్తోంది.

 

More

Related Stories