శృతి ‘భార్య’ పాత్రలకి పరిమితం!

Shruti Haasan

ఒక హీరోయిన్ ఒక పెద్ద సినిమాలో మూవీ ఆసాంతం “భార్య” పాత్రలోనే కనిపించింది అంటే… ఆమె “సీనియర్ హీరోయిన్ల” ఖాతాలో చేరినట్లే. మెల్లమెల్లగా గ్లామర్ హీరోయిన్, లవర్ గర్ల్ పాత్రలు చేజారిపోతాయి. శృతి హాసన్ ఆ జాబితాలో చేరినట్లు అనిపిస్తోంది.

తాజాగా విడుదలైన “క్రాక్” సినిమాలో శృతి పాత్ర అలాంటిదే. ఈ సినిమాలో ఆమె కళ్యాణిగా కనిపించింది. ఆమె రవితేజకి భార్య, ఓ ఐదారేళ్ళ కొడుకున్న తల్లి. సినిమా బిగినింగ్ లోనే ఆమె భార్యగా దర్శనం ఇస్తుంది. చివర్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టినా…. శృతి పాత్ర నిడివి చాలా తక్కువ. సెకండాఫ్ లో ఆమె కనిపించేది కూడా తక్కువే. అంటే… శృతిని పూర్తిగా సీనియర్ హీరోయిన్ గా అప్రాధాన్య పాత్రలోకి నెట్టేసినట్లే.

త్వరలో విడుదల కానున్న “వకీల్ సాబ్” సినిమాలో కూడా ఆమెది పవన్ కళ్యాణ్ భార్య పాత్ర. ఇందులో కూడా ఆమె ఒక పాటలో, కొన్ని సీన్లకే పరిమితం.

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి రోల్స్ చెయ్యడంతో 34 ఏళ్ల శృతి హాసన్ కెరీర్ హీరోయిన్ గా క్లైమాక్స్ లో పండింది అని అర్థం అనుకోవాలా?

More

Related Stories