ఈ ఏడాది శృతి పెళ్లి చేసుకుంటుందా?

Shruti Haasan

శృతి హాసన్ పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఆమె అభిమానులు కూడా ఆమెని అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇటీవల అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నారట కదా? అన్న ప్రశ్న వచ్చింది ఒక అభిమాని నుంచి. ఆమె ఇచ్చిన రిప్లై: “ఫాల్స్”.

ఈ ఏడాది ఆమె పెళ్లి చేసుకోనుంది అనే వార్తల్లో నిజం లేదని క్లారిటీగా చెప్పింది శృతి హాసన్.

శృతికిప్పుడు 34 ఏళ్ళు. ఆమె ఒకప్పుడు ఆల్కహాల్ బాగా తీసుకొనేది. ఆ వ్యసనం నుంచి బయటపడినట్లు ఆమె వెల్లడించింది. ఇప్పుడు మందు అంటే కిలోమీటర్ దూరం. అలాగే, లాక్డౌన్ లో వంట కూడా బాగా నేర్చుకొంది. ఇవన్నీ చూసే పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఐతే, శృతి ఇప్పుడు కెరీర్ పైనే పెట్టాలనికుంటుంది. “క్రాక్” విజయం ఆమెకి కాన్ఫిడెన్స్ పెంచింది.

“వకీల్ సాబ్” కూడా హిట్టయితే, మళ్లీ దశ తిరుగుతుంది.

More

Related Stories