శృతిహాసన్ బ్యూటీ స్టేట్ మెంట్స్

Shruti Haasan

లాక్ డౌన్ టైమ్ లో ఫ్యాన్స్ తో ఫుల్ గా టచ్ లోకి వచ్చింది శృతిహాసన్. రీసెంట్ గా ఆమె సెట్స్ పైకి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె హంగామా తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ శృతి మాత్రం సైలెంట్ అవ్వలేదు. గంటగంటకు ఓ అప్ డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా కొన్ని బ్యూటీ స్టేట్ మెంట్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.

శృతిహాసన్ ఉద్దేశంలో బ్యూటీ పేరుతో చెడగొట్టుకునేది ఏదైనా ఉందంటే అది జుట్టు మాత్రమేనట. సహజంగా పెరిగే జుట్టుకు కెమికల్స్ రాయడం, స్ట్రయిటనింగ్ పేరిట రీ-బాండింగ్ చేయడం లాంటివి చేసి జుట్టును నాశనం చేస్తున్నారని ఆమె అభిప్రాయం.

ఇక జీవితమంతా ఒకే ఒక్క లిప్ కలర్ తో గడపాల్సి వస్తే.. కచ్చితంగా పింక్ కలర్ షేడ్ ఉన్న లిప్ స్టిక్స్ సెలక్ట్ చేసుకుంటుందట శృతి. దీంతో పాటు బ్యాగ్ లో డీ-3 ఆయిల్ తో ఉండే క్లెన్సర్ ఉంటే చాలా బాగుంటుందని సూచిస్తోంది. మేకప్ కిట్ లో కచ్చితంగా డీ-3 ప్రొడెక్ట్స్ ఉండాలని, లేకపోతే లాంగ్ రన్ లో స్కిన్ కు చాలా ఇబ్బంది అని వార్న్ చేస్తోంది ఈ చిన్నది.

Related Stories