
నా వయసు చెప్పుకోండి చూద్దాం అంటోంది శృతిహాసన్. ఆమె వయసు ఎంతనేది చాలామందికి తెలుసు. కానీ ఆమె మనసు వయసు ఎంతో శృతిహాసన్ కు మాత్రమే తెలుసు.
తన ఏజ్ మూడు పదులు దాటినా, మనసు మాత్రం ఐదేళ్ల దగ్గరే ఆగిపోయిందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ తన మనసు చిన్నపిల్లలానే ప్రవర్తిస్తుందని అంటోంది.
ఇక తన అందానికి సంబంధించి మంచి గతం గురించి మాట్లాడాల్సి వస్తే కచ్చితంగా అది తన జుట్టు మాత్రమే అంటోంది శృతి. ఒకప్పుడు తన హెయిర్ చాలా బాగుండేదని, అదంతా గతం అని గుర్తుచేస్తోంది. మరోవైపు బాత్ టబ్ కంటే షవర్ బాత్ నే తను ఎక్కువగా ఇష్టపడతానంటోంది ఈ బ్యూటీ. షవర్ బాత్ చేస్తే ఆ మజానే వేరంటోంది.
లాక్ డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈ బ్యూటీ తన సినిమా షూటింగ్స్ కు హాజరవుతోంది. త్వరలోనే ‘వకీల్ సాబ్’ సెట్స్ పైకి కూడా రాబోతోంది.