- Advertisement -

మంగళవారం నాడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ కూడా పోటీలో ఉన్నారు. MNM అనే పార్టీకి కమల్ అధ్యక్షుడు. దక్షిణ కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉండగా, మరో 150కి పైగా స్థానాల్లో ఆయన పార్టీ అభ్యర్థులు పోటీకి దిగారు. కమల్ హాసన్ తమిళనాడు స్టేట్ అంతా తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
కమల్ అన్నయ్య కూతురు నటి సుహాసిని దక్షిణ కోయంబత్తూర్ లో ప్రచారం నిర్వహించారు. కమల్ చిన్న కూతురు అక్షర కూడా ప్రచారంలో పాల్గొంది. కానీ ఆయన పెద్ద కూతురు శృతి హాసన్ మాత్రం తన తండ్రి తరఫున ప్రచారానికి రాలేదు. మొత్తంగా ఆమె డుమ్మా కొట్టింది.
శృతి అటు సోషల్ మీడియాలో కూడా తండ్రి తరఫున పెద్దగా పోస్టులు పెట్టలేదు. ఆమె పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంది.