- Advertisement -

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ మూడోసారి కలిసి నటిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత పవన్, శృతి కలిసి నటిస్తున్న మూవీ… “వకీల్ సాబ్’. గత ఐదు రోజులుగా ‘వకీల్ సాబ్’ షూటింగ్లో పాల్గొంటోంది. వచ్చేవారమే ఒక డ్యూయెట్ తీస్తారట.
ఈ సినిమా… “పింక్” అనే బాలీవుడ్ సినిమాకి రీమేక్. తమిళంలో అజిత్ హీరోగా కూడా రూపొందింది. ఐతే, హిందీ, తమిళ్ సినిమాకి డిఫరెంట్ గా రొమాన్స్, డ్యూయెట్లు కూడా ఉంటాయిందులో. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ అభిమానులని నిరాశపర్చకుండా “కమర్షియల్” హంగులు అన్ని జోడిస్తున్నారు.
కేవలం పవన్ కళ్యాణ్ అంటే ఉన్న గౌరవం, అభిమానం కారణంగానే శృతి ఈ సినిమా ఒప్పుకొంది. ఎందుకంటే, ఆమెది ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర కాదు.