బిజి అయిపోతున్న శృతి హాసన్

- Advertisement -

హీరోయిన్ శృతి మళ్ళీ తెలుగులో బిజీ అయిపోతోంది. ఆమె చేతిలో ఇప్పుడు మూడు పెద్ద చిత్రాలున్నాయి. మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఆమెకి ఉన్నట్టుండి క్రేజ్ పెరగడం కారణమేంటో.

‘క్రాక్’ సినిమా విజయం సాదించగానే శృతి ప్రభాస్ సరసన ‘సలార్’ ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా సైన్ చేసింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సరసన సినిమా ఒప్పుకొంది. ఈ మూడు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి.

హిందీలో మాత్రం క్రేజ్ తగ్గిపోయింది. అక్కడ వెబ్ సిరీస్ ల్లో మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. తమిళ నిర్మాతలు పూర్తిగా శృతి హాసన్ ని మర్చిపోయారు. దాంతో, ఆమె తెలుగులో వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

మరోవైపు, శృతి హాసన్ తన సినిమాల రివ్యూస్ చదవను అని సెల్ఫ్ డబ్బాగా చెప్తోంది. కానీ, తన సినిమా విడుదలైన రెండు, మూడు రోజులు ఎవరు పొగుడుతూ పోస్టులు పెట్టినా వాటిని షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది.

 

More

Related Stories