
శృతి హాసన్ కి 35 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. ఆమె యంగ్ హీరోయినే. కానీ, ఇప్పటికే ‘సీనియర్’ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ భామ. 60 ఏళ్లు పైబడిన హీరోలతో జతకడుతోంది శృతి హాసన్. ఆమె వరుసగా రెండు పెద్ద సినిమాల్లో సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
ఇంతకుముందు నయనతార, కాజల్ తో జతకట్టేందుకు సీనియర్ హీరోలు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు ఆ లీగ్ లో చేరిన నటి శృతి హాసన్.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఇటీవల ఒక ప్రారంభం అయింది. అందులో హీరోయిన్ శృతి. బాలయ్యకి జోడి. ఇక తాజాగా చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రంలో ఆమె హీరోయిన్.
ALSO READ: It’s official: Shruti Haasan opposite Chiranjeevi
కాజల్ గర్భవతి. దాంతో, ఆమె సినిమాలు ఒప్పుకోవడం లేదు. నయనతార పారితోషికం ఎక్కువ. పైగా, ఆమె ఇప్పటికే బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున పలు సినిమాలు చేసింది. సో, మిగిలిన 30 ప్లస్ హీరోయిన్ లలో శృతి హాసన్, తమన్నాలున్నారు. అందుకే, వీరికే సీనియర్ హీరోలు ఆఫర్లు ఇస్తున్నారు.
శృతి హాసన్ కొంచెం తెలివిగా సీనియర్ హీరోల సరసన నటించేందుకు ప్రీమియం రేట్ అడుగుతున్నట్లు టాక్.