లాక్డౌన్ లోనూ ‘శృతి’లయలు

Shruti Haasan's Music album

లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా చిన్నచిన్న వీడియోలు పెట్టడం, వంటలు చేయడం లాంటివి చేశారు. రాశిఖన్నా లాంటి వాళ్లు తాము నేర్చుకున్న గిటార్ విద్యను ప్రదర్శించారు. అయితే శృతిహాసన్ మాత్రం తన టాలెంట్ మొత్తం బయటపెట్టింది. ఆమె వంటలు చేసింది. అవి కూడా షేర్ చేసింది. దాంతో పాటు ఒక పాట కూడా తీసుకొచ్చింది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏకంగా ఓ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేసింది శృతిహాసన్. ఇదేదో నామ్ కే వాస్తే చేసిన వీడియో కేదు. లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో కూర్చొని.. తనే ఈ పాట రాసుకుంది. పాటకు తనే కంపోజిషన్ చేసుకుంది. తనే పాడింది. ఫైనల్ గా తనే నటించింది.

Shruti Haasan - Edge | Official Music Video

ఈ సాంగ్ షూట్ కోసం ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లలేదు. ఇళ్లు కదల్లేదు. సింపుల్ గా ఇంట్లోనే ఐఫోన్ తో షూట్ చేశారు. ఓ వ్యక్తి చిన్నగా ఆర్ట్ వర్క్ చేస్తే, మరో వ్యక్తి సింపుల్ గా ఎడిటింగ్ చేశాడు. అంతే.. పాట రెడీ అయింది.

“టేక్ మీ.. టేక్ మీ.. “అనే లిరిక్స్ తో సాగే ఈ పాట బాగుంది. ఇంగ్లీష్ పాప్ సాంగ్ ఈ పాప తీసుకొచ్చింది.

Related Stories