
మాజీ బాయ్ ఫ్రెండ్ కోర్సల్ తో కలిసి లండన్ వీధుల్లో ఓ రేంజ్ లో షికార్లు చేసింది శృతిహాసన్. గతేడాది ఎక్కువ రోజులు లండన్ లోనే ఉండిపోయింది. అయితే అదంతా గతం. ఇప్పుడామెకు బాయ్ ఫ్రెండ్ లేడు. అయితే అతన్ని మరిచిపోయినా లండన్ ను మాత్రం మరిచిపోలేకపోతోంది శృతిహాసన్.
ఎప్పటికప్పుడు లండన్ పై తనకున్న ప్రేమను బయటపెడుతూనే ఉంది. మెమొరీస్ అంటూ గతంలో లండన్ లో దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది శృతిహాసన్. “ఐ మిస్ లండన్” అంటూ ఓ క్యాప్షన్ కూడా తగిలించింది.
శృతిహాసన్ కు లండన్ అంటే అంతిష్టం. అంతెందుకు.. లాక్ డౌన్ టైమ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఏ రెస్టారెంట్ మిస్ అవుతున్నారనే ప్రశ్నకు బోన్ డాడీస్ అనే రెస్టారెంట్ ను చాలా మిస్ అవుతున్నానని తెలిపింది. ఆ రెస్టారెంట్ లండన్ లోనే ఉంది మరి.
Also Read: Shruti Haasan Latest Photos

ఇలా లండన్ పై తన ప్రేమను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది ఈ బ్యూటీ. కాస్త గ్యాప్ దొరికితే మరోసారి లండన్ ఎగిరిపోతుందేమో.
మరోవైపు, ఆమె మరోసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించనుంది. “వకీల్ సాబ్”లో ఆమె పవన్ కళ్యాణ్ కి జోడి. చిన్న పాత్ర. ఐతే, పవన్ కళ్యాణ్ తో పెయిర్ కావడంతో ఒప్పుకొంది. వచ్చే నెలలో షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది.