ఫిజికల్ గా టచ్ లో లేను: శృతి

శృతిహాసన్ తో చిట్ చాట్

అందాల తార శృతిహాసన్ మరోసారి ఫ్యాన్స్ తో టచ్ లోకి వచ్చింది. ఈసారి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ షేర్ చేసింది. ఓవైపు హెల్త్ టిప్స్ ఇస్తూనే, మరోవైపు తన మనసులో భావాల్ని బయటపెడుతున్న ఈ ముద్దుగుమ్మతో స్మాల్ చిట్ చాట్.

1. యూట్యూబ్ వర్కవుట్స్ ట్రై చేశారా?
కెరీర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ వర్కవుట్సే ఎక్కువగా చేశాను. తర్వాత పర్సనల్ ట్రయినర్ వచ్చాడు.

2. పని లేకుండా ముస్తాబయ్యావా?
ఈ లాక్ డౌన్ టైమ్ లో చేసిందంతా అదే. ఏ పని లేకపోయినా మేకప్ వేసుకొని, మంచి దుస్తులు వేసుకున్నాను. ఇంకో డ్రెస్ మిగిలిపోయింది. త్వరలోనే వేసుకొని పిక్స్ షేర్ చేస్తాను.

3. లాక్ డౌన్ తర్వాత ఏ రెస్టారెంట్ కు వెళ్లాలని అనిపిస్తోంది?
లండన్ లో బోన్ డాడీస్ రెస్టారెంట్ ను బాగా మిస్సవుతున్నాను. ఆ రెస్టారెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పట్లో వెళ్లలేను.

Shruti Haasan

4. రీసెంట్ గా చదివిన పుస్తకం
ఈ లాక్ డౌన్ టైమ్ లో వెబ్ సిరీస్ చూడ్డానికే టైమ్ సరిపోలేదు. పుస్తకాలేం చదవలేదు. త్వరలోనే కొన్ని పుస్తకాలు కొంటాను.

5. ఈ క్వారంటైన్ మిమ్మల్ని ఎలా మార్చింది?
సైలెంట్ గా ఉండడం నేర్పించింది. ఎదుటి వ్యక్తుల గురించి కూడా ఆలోచించేలా చేసింది. మరింత ప్రేమగా ఉండాలని తెలుసుకున్నాను.

6. బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ వీకెండ్ ఏం చేయాలనుకుంటున్నావ్?
త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాడు. కుదిరితే వీకెండ్ లో కూడా వర్క్ చేయాలని ఉంది.

7. ఇప్పటికిప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెబుతారు?
ఇప్పటికిప్పుడు టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో టెక్నాలజీ కనుక లేకపోతే పిచ్చెక్కిపోయేది. ఫిజికల్ గా కలవకపోయినా, అందరితో టచ్ లో ఉంటున్నామంటే దానికి కారణం టెక్నాలజీ. 

Related Stories