‘దేవర’లో హీరోయినే కానీ!

హిందీ, మరాఠీ సినిమాల్లో నటించే ముంబై భామ శ్రుతి మరాఠె తాజాగా తాను ‘దేవర’లో నటిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, తాను ఎన్టీఆర్ కి భార్యగా నటిస్తున్నట్లు చెప్పింది. దాంతో, ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ దాచిపెట్టిన విషయాన్ని ఆమె బయటపెట్టినట్లింది.

“దేవర” సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ ప్రకటించలేదు. అది సర్ప్రైజ్ గా ఉండాలనుకున్నారు. కానీ అది ఇప్పటికే బయటికి వచ్చేసింది శృతి మాటతో.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్, జాన్వీపైనే మూడు పాటలు ఉంటాయి.

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండో పాత్రకు భార్యగా శ్రుతి మరాఠె నటిస్తున్నారట. ఈమె కూడా హీరోయినే కానీ జాన్వీ కపూర్ లా రొమాంటిక్ డ్యూయెట్లు వంటివి ఉండవు.

Advertisement
 

More

Related Stories