గోదావరికి శ్యామ్ సింగరాయ్ షిఫ్ట్!

Shyam Singa Roy

నాని హీరోగా రూపొందుతోన్న “శ్యామ్‌ సింగరాయ్‌” సినిమా బెంగాల్ నేపథ్యంగా సాగే కథ. ఇటీవలే కోల్కోతాలో షూటింగ్ చేశారు. అక్కడ ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండడడంతో షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని… మిగతా సీన్లను గోదావరి వొడ్డున తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద గోదావరి తీరంలో హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవిలపై ప్రస్తుతం సీన్లు చిత్రీకరిస్తున్నారు.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కూడా ఒక హీరోయిన్.

పునర్జన్మల నేపథ్యంగా ఈ కథ ఉంటుందంట. నాని కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీతో తీస్తున్నారు. స్టోరీ బాగా నచ్చడంతో నాని కూడా నిర్మాణంలో పార్ట్నర్ షిప్ తీసుకున్నాడని టాక్. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దింపాలని ప్రయత్నిస్తున్నారు.

నాని నటించిన మరో మూవీ ‘టక్ జగదీష్’ వచ్చే నెల 23న విడుదల కానుంది. అలాగే, ‘అంటే సుందరానికి’ అనే మరో సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.

More

Related Stories