- Advertisement -

‘డియర్ మేఘ’ చిత్రంలోని ‘ఆమని ఉంటే పక్కన’ అనే పాట ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ సాధించింది. తాజాగా సిధ్ శ్రీరామ్ ఆలపించిన “బాగుంది ఈ కాలమే..” లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఇది కూడా వైరల్ అయ్యేలా ఉంది.
హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్ తనదైన శైలిలో పాడారు ఈ సాంగ్ ని. ఆయన పాటలన్నీ వైరల్ అవుతాయి కదా! ఈ పాటను కృష్ణ కాంత్ రాయగా…. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర ట్యూన్ చేశారు.
”డియర్ మేఘ” చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో, హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమకథగా దీన్ని మలుస్తున్నామని అంటున్నారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. అర్జున్ దాస్యన్ నిర్మించిన ”డియర్ మేఘ” త్వరలోనే థియేటర్లోకి రానుంది.