రాజమౌళిని మించిపోతున్న సిద్ధార్థ్

Siddharth Anand

ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్… ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్లు అలాంటివి. ఆయన అందుకునే పారితోషికం అలాంటిది. రాజమౌళి కొన్నాళ్లుగా పారితోషికంతో పాటు వ్యాపారంలో వాటా తీసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కో సినిమాకి 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ముడుతుంది. “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి మాత్రం అంతకన్నా ఎక్కువే దక్కింది అనేది టాక్.

ఐతే, వాటా పక్కన పెడితే కేవలం పారితోషికం మాత్రం 100 కోట్లు తీసుకుంటారు. ఇప్పుడు మరో దర్శకుడు రాజమౌళికి మించి హిట్ కొట్టాడు. అతనే సిద్ధార్థ్ ఆనంద్. షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తీసిన ‘పఠాన్’ సినిమా ఇప్పటికే ఇండియాలో 400 కోట్లు వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు కొల్లగొట్టింది. దాంతో ఈ దర్శకుడికి బాలీవుడ్ లో యమా డిమాండ్ ఉంది.

సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం హృతిక్ రోషన్, దీపిక జంటగా ‘ఫైటర్’ అనే సినిమా తీస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ఒక మూవీ చేసేందుకు అంగీకరించాడు. మన తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ ని సెట్ చేసింది.

ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ ఏకంగా 150 కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. ఒకవేళ మైత్రి మూవీ మేకర్స్ అంత పారితోషికానికి ఒప్పుకుంటే అతను పారితోషికం విషయంలో రాజమౌళిని మించిపోయినట్లే.

 

More

Related Stories