
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ఆదితి రావు ప్రేమించుకుంటున్నారు అని మీడియాలో ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. వాళ్ళ డేటింగ్ న్యూస్ కొత్త కాదు. కాకపొతే, సిద్ధార్థ్, ఆదితి రావు ఇప్పటివరకు బహిరంగంగా ఈ విషయాన్ని ఒప్పుకోలేదు.
ఐతే, ఇప్పుడు వీరు ఫంక్షన్లకు కూడా జంటగా వస్తుండడంతో ఇక దాచిపెట్టేదేమీ లేదని చెప్పొచ్చు. మెల్లగా తమ లవ్ అఫైర్ గురించి జనాల ముందు ఓపెన్ అవుతున్నారు.
హీరో శర్వానంద్ రక్షిత అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. వీరి నిశ్చితార్థం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ కి సిద్ధార్థ్, ఆదితి రావు జంటగా వచ్చారు. అక్కడ అందరిని జంటగానే పరిచయం చేసుకున్నారు.
‘మహా సముద్రం’ అనే సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, ఆదితి రావు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే సిద్ధార్థ్, ఆదితి మనసులు కలవడంతో ఇద్దరూ లవ్వు మొదలుపెట్టారు.

సిద్ధార్థ్, ఆదితి రావు ముంబైలోనే ఉంటున్నారు. సిద్ధార్థ్ గతంలో సమంత, శృతి హాసన్ వంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. ఐతే, ఆదితి, సిద్ధార్థ్ ల ఈ బంధం పెళ్లివరకు వెళ్తుందా లేదా అన్నది చూడాలి.