ప్రియురాలికి ‘బర్త్ డే’ విషెష్!

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు డేటింగ్ లో ఉన్నారని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. అదితి ఇంటికి రహస్యం వెళ్లి వస్తుండగా మీడియా కంట చిక్కడం, మీడియా మీడియా సిద్ధార్థ్ ఫైర్ కావడం ఇటీవలే చూశాం. ఆ వీడియో వైరల్ అయింది.

ఐతే, ఇప్పుడు తమ ‘ప్రేమ వ్యవహారాన్ని’ దాచుకోవడం లేదు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. దాంతో, ఆమెతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… సిద్ధార్థ్ ఆమెకి ప్రత్యేకంగా విషెష్ చెప్పాడు. ఆమెని మదిని దోచుకునే రాకుమారి అని అభివర్ణించాడు.

తన శుభాకాంక్షల్లో చాలా కవిత్వం కూడా వొలికించాడు. దాంతోనే అర్థమవుతోంది సిద్ధార్థ్ అదితితో డీప్ లవ్వులో ఉన్నాడని.

సిద్దార్థ్ 40 ప్లస్ లో ఉండగా, ఆమెకి 36 ఏళ్ళు. మరి వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందా అనేది చూడాలి. సిద్ధార్థ్ ఇంతకుముందు శృతి హాసన్, సమంత, సోహా అలీ ఖాన్ వంటి హీరోయిన్లతో చాలా కాలం డేటింగ్ చేశాడు. ఆ బంధాలు పెళ్లి వరకు వెళ్ళలేదు.

‘మహా సముద్రం’ అనే సినిమా షూటింగ్ లో వీరి డేటింగ్ మొదలైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ, ఈ జంటకి ఆ సినిమా కలిసొచ్చింది.

 

More

Related Stories