‘ఫోటో తీస్తే మర్యాద దక్కదు’


హీరో సిద్ధార్థ్ కి కోపమొచ్చింది. ఫొటోగ్రాఫర్ల అతని ఫోటో తీసే ప్రయత్నం చెయ్యడంతో గయ్యిమని ఎగిరాడు. “ఫోటో తీస్తే మర్యాద దక్కదు. ఇదే ఫైనల్ వార్నింగ్,” అని ధమ్కీ ఇచ్చాడు సిద్దూ.

ఫోటో తీస్తే ఎందుకు కోపం అనే కదా మీ డౌట్. ఎందుకంటే ఆయన హీరోయిన్ అదితి ఇంటికి వెళ్తున్నాడు. ఆమె ఇంటివద్ద ఫొటోగ్రాఫర్లు ఫోటో తీసేందుకు ట్రై చేశారు. ముంబైలో పాపరాజ్జి (ఫొటోగ్రాఫర్లు) పేరొందిన హీరోయిన్లు, హీరోల ఇంటి వద్ద, జిమ్ ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. మంచి ఫోటో తీసి మీడియాకి ఇస్తారు. సిద్ధార్థ్… తన ప్రియురాలు ఆదితి ఇంటికి వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు.

సిద్ధార్థ్, ఆదితి కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న విషయం మొన్నటి వరకు గాసిప్. ఇప్పుడు అది బయటపడింది. ‘మహాసముద్రం’ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మునిగి తేలినట్లు టాక్. సినిమా మునిగింది కానీ వీరి ప్రేమ తీరం చేరింది.

43 ఏళ్ల సిద్ధార్థ్ కి హీరోయిన్లతో డేటింగులు కొత్త కాదు. మరి ఆదితితో అయినా డేటింగ్ పెళ్లి వరకు వెళ్తుందా అన్నది చూడాలి. ఆమెకి ఇంతకుముందే ఒక పెళ్లి చేసుకొంది. భర్తకు విడాకులు ఇచ్చాక సింగిల్ గానే జీవితాన్ని కొనసాగిస్తోంది.

 

More

Related Stories