
సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన ఒక తమిళ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు తెలుగులో “చిన్నా” పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధార్థ్ ఇంతకంటే మంచి సినిమా ఇక తాను తీయలేను అన్నారు.
“‘చిన్నా’ సినిమా నా లైఫ్ డ్రీమ్. ఇంతకంటే మంచి సినిమా ఇక నేను తీయలేను. ఇదే విషయాన్ని మా గురువు మణిరత్నం గారికి చెప్పాను. నేను కష్టపడి ఆర్జించిన దాంట్లోనే నా ఫ్యామిలీని చూసుకొని, మిగిలిన డబ్బులతో నిర్మిస్తా. ఇదీ నా పద్ధతి. ఇది నా బెస్ట్ మూవీ,” అని ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్.
తెలుగులో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కొందరు అవమానించినట్లు చెప్పుకున్నాడు సిద్ధార్థ్.
“తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ నా సినిమాను కొన్నారు. అలాగే కేరళలో గోకులం గోపాలన్ గారు కొని విడుదల చేశారు. కర్ణాటకలో కె.జి.యఫ్ ప్రొడ్యూసర్స్ నా సినిమాను తీసుకున్నారు. కానీ తెలుగులో సిద్ధార్థ్ సినిమానా? ఎవరు చూస్తారని అడిగారు. థియేటర్స్ దొరకలేదు. ఆ సమయంలో నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చింది ఏషియన్ సునీల్ గారు. ఈ సందర్భంగా జాన్వీకి థాంక్స్. మంచి సినిమా తీస్తే ఆడియెన్స్ చూస్తారని నమ్మాను. సినిమాలంటే ఇష్టముంటే థియేటర్‌లో మూవీ చూడండి. నేను కె.విశ్వనాథ్‌గారి సినిమాలను చూసే మూవీస్ గురించి నేర్చుకున్నాను. అందుకనే చిన్నా సినిమాను ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు సిద్ధార్థ్.