సిద్ధార్థ్… ఇదేమి సెలెక్షన్!

Takkar

హీరో సిద్ధార్థ్ చాలా ప్రతిభావంతుడు. మంచి నటుడు. అందగాడు. 40లలో కూడా ఇంకా చిన్న కుర్రాడిలా ఉంటాడు. అలాగే చాలా మేధావిలా కనిపిస్తాడు. సినిమాపై చాలా నాలెడ్జ్ ఉన్నవాడిలా మాట్లాడుతుంటాడు.

ఐతే, ఆయన అంత తెలివితేటలు ఉన్నా స్టోరీ సెలెక్షన్ లో మాత్రం వీక్. కథలను సరిగా జడ్జ్ చెయ్యలేడు అని అర్థమవుతోంది. ఆ మధ్య ‘మహా సముద్రం’ సినిమాలో నటించినప్పుడు ఇట్లాంటి సినిమా రాలేదు. అదొక ట్రెండ్ సెట్ అవుతుంది అని ఏవేవో చెప్పాడు. తీరా అది విడుదలై ప్రేక్షకుల నుంచి రిజెక్షన్ పొందింది. అంతే కాదు, ఆయన చెప్పినట్లు అందులో ఈ గొప్పదనం లేదు, ఈ ట్రెండ్ క్రియేట్ కాలేదు.

‘మహా సముద్రం’ కథ కూడా కొత్తది కాదు.

తాజాగా, ‘టక్కర్’ సినిమా ప్రొమోషన్ అప్పుడు కూడా అదే హడావిడి చేశాడు. తీరా దర్శకుడు సినిమా తీసిన తీరు చూస్తే అసలు సిద్ధార్థ్ చూసిన సినిమా, ప్రేక్షకులు చూసింది ఒకటేనా అని డౌట్ వస్తోంది. ‘టక్కర్’ ఐతే మరీ ఘోరం. కథ కన్నా దర్శకుడి నేరేషన్ నీరసం, నాసిరకం, కంగాళీ. కానీ, రిలీజ్ కి ముందు సిద్ధార్థ్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు.

ఈ సినిమాలు, ఆయన ఒప్పుకుంటున్న కథలు చూస్తుంటే ఆయన మేధావితనం మీద సందేహాలు కలుగుతున్నాయి.

Advertisement
 

More

Related Stories