రీఎంట్రీ అయినా కలిసొస్తుందా?

Siddharth

టాలీవుడ్ లో రీఎంట్రీ కోసం ఇప్పటికే 2 సార్లు ప్రయత్నించాడు సిద్దార్థ్. కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టాలీవుడ్ లో లక్ చెక్ చేసుకోబోతున్నాడు ఈ హీరో. మరి ఈసారైనా ఆయన సక్సెస్ అవుతాడా?

మూడేళ్ల కిందట తెలుగులో “గృహం” సినిమా రిలీజ్ చేశాడు సిద్దార్థ్. హారర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకుల్ని ఆ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. కాకపోతే ఆ సినిమా సిద్దార్థ్ రీఎంట్రీకి బొత్తిగా కలిసిరాలేదు. అంతకంటే ముందు ఓ తమిళ సినిమా డబ్బింగ్ తో తెలుగులో రాణించాలనుకున్నాడు. ఆ సినిమాలపై నమ్మకంతో తెలుగులో ప్రచారం కూడా చేశాడు. కానీ అది కూడా కలిసిరాలేదు

అలా తెలుగుతెరకు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ నటుడు.. ఇప్పుడు ‘మహాసముద్రం’ ప్రాజెక్టుతో మరోసారి టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ కు జోడీగా అదితిరావు నటించే అవకాశం ఉంది. 

Related Stories