ఆ కోరిక తొందరగా తీరింది: సిద్దీ

శింబు హీరోగా గౌతమ్ మీనన్ తీస్తున్న కొత్త చిత్రం… ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సిద్దీ ఇధ్నానీ తన జీవితం మారిపోయింది అని చెప్తోంది. శింబు సరసన… అదీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అవకాశం వస్తుందని ఊహించారా అని అడిగితే చాలా ఏక్సయిట్ అవుతూ సమాధానం ఇచ్చింది.

“గౌతమ్ మీనన్ తీసిన చిత్రాల్లో ‘ఏ మాయ చేసావె’, ‘చెలి’ నా ఫేవరెట్ ఫిల్మ్స్. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేది. ఆ కోరిక కెరీర్ లో తొందరగా తీరింది. నేను లక్కీ అమ్మాయిని. గౌతమ్ సినిమాలో నటిస్తున్నాను అనే న్యూస్ నిజమని నమ్మడానికి నాకు టైమ్ పట్టింది. నేను షూటింగ్ స్టార్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఒక రోజు షూట్ క్యాన్సిల్ చేశారు. నాకు చాలా భయం వేసింది. నా బదులు వేరే ఎవరినైనా సెలెక్ట్ చేశారనుకున్నాను. గౌతమ్ మీనన్ గారికి ఫోన్ చేసి ‘నేను సినిమాలో ఉన్నానా? ఓకేనా?’ అని అడిగా. ‘నువ్వు వర్రీ అవ్వొద్దు. సినిమాలో ఉన్నావ్ అని చెప్పారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను,” అని చెప్పింది సిద్దీ.

“నా పాత్ర పేరు పావని. బొంబాయిలో పెరిగిన తమిళమ్మాయి. గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో ఒక అందం, ఒక ఆకర్షణ, ఒక ప్రత్యేకత ఉంటాయి,” తన పాత్ర గురించి వివరించింది.

సిద్దీ ఇధ్నానీ ఇంతకుముందు కమెడియన్ శ్రీనివాస రెడ్డి సరసన ‘జంబ లకిడి పంబ’ అనే సినిమాలో నటించింది.

 

More

Related Stories