సిద్దూ ‘బొమ్మరిల్లు’ షురూ!

- Advertisement -
Siddhu Jonnalagadda, Bommarillu Bhaskar and BVSN Prasad

“డీజే టిల్లు” సినిమాతో ఒక్కసారిగా స్టార్డం పొందాడు సిద్దు జొన్నలగడ్డ. ఒకవైపు “టిల్లు స్క్వేర్”లో నటిస్తూనే కొత్తగా పలు సినిమాలు ఒప్పుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌తో చేతులు కలిపారు.

బొమ్మరిల్లు భాస్కర్ ఇటీవలే అఖిల్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తీశారు. ఇప్పుడు సిద్దూ హీరోగా కొత్త సినిమా మొదలుపెడుతాడట. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్ షూటింగ్ ప్రారంభం అయింది.

ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. ఇంకా హీరోయిన్ ఎవరు అనేది తేలలేదు.

మరోవైపు, సిద్ధూ జొన్నలగడ్ద ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో “తెలుసు కదా” అనే సినిమా కూడా చేస్తున్నాడు.

 

More

Related Stories