నేపాల్ వెళ్లనున్న సిద్దూ!

Siddhu Jonnalagada

“టిల్లు స్క్వేర్”తో భారీ విజయం అందుకున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. మరోసారి తన యాక్టింగ్ స్టయిల్, డైలాగ్ డెలివరీతోనే సినిమాని హిట్ చేశాడు. ఇక ఈ యువ హీరో తన కొత్త సినిమా షూటింగ్ తో బిజీ కానున్నాడు.

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా “జాక్” అనే సినిమా రూపొందుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకుడు. బాపినీడు, బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం జరిగింది. ఐతే ఈ కథలో కీలక భాగం హిమాలయాల నేపథ్యంగా సాగుతుందట. అందుకే, ఆ సన్నివేశాలను నేపాల్ లో చిత్రకరించాలని ప్లాన్ చేసింది టీం.

దాదాపు 25 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేస్తారంట. “బేబీ” సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్. సిద్ధూ, వైష్ణవి చైతన్య జంటపై అక్కడ సీన్లు తీస్తారు.

“జాక్” కాకుండా సిద్ధూ “తెలుసు కదా” అనే సినిమా చేస్తున్నాడు. ఐతే, ఫస్ట్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలా ఉంది.

Advertisement
 

More

Related Stories