
ఈ మధ్య కాలంలో సడెన్ గా పాపులర్ అయిన హీరోల జాబితాలోకి సిద్ధూ జొన్నలగడ్డ కూడా చేరాడు. గతేడాది ‘జాతిరత్నాలు’ చిత్రంతో నవీన్ పోలిశెట్టి, ‘ఉప్పెన’ చిత్రంతో వైష్ణవ్ తేజ్ పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు వాళ్ళు.
గత వీకెండ్ విడుదలైన ‘డీజే టిల్లు’తో ఇప్పుడు సిద్దూ జొన్నలగడ్డ ఫోకస్ లోకి వచ్చాడు. సిద్దూ చాలాకాలంగా సినిమాల్లో నటిస్తున్నాడు. ‘గుంటూరు టాకీస్’ సినిమాతో ఓ మోస్తరు విజయం దక్కింది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయి కొంచెం పేరు వచ్చింది.
కానీ థియేటర్లో భారీ సక్సెస్ మాత్రం … ‘డీజే టిల్లు’తో వచ్చింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ ఫోకస్ ఈ కుర్ర హీరోపై ఉంటుంది. చాలామంది నిర్మాతలు సిద్దూతో ప్లాన్ చెయ్యడం ఖాయం. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఒక మాట అంటారు. ‘ప్రతి శుక్రవారం ఒక హీరో పుడతాడు’ అనేది ఆ మాట.
ఐతే, సిద్దూ ‘డీజే టిల్లు 2’ ముందుగా తీస్తాడట. ఈ సక్సెస్ ని క్యాష్ చేసుకుంటారన్నమాట.