పుష్పక విమానం ‘సిలకా’ పాట రిలీజ్

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ దీనికి ప్రెజెంటర్. ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ‘‘సిలకా’’ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

‘‘సిలకా ఎగిరిపోయావా ఆసలన్ని ఇడిసేసి ఎనకా…సిలకా చిన్నబోయిందె సిట్టి గుండె పిట్ట నువ్వు లేక ‘‘ అంటూ సాగే ఈ పాటకు రామ్ మిరియాల సంగీతాన్ని అందించడంతో పాటు మరో గీత రచయిత ఆనంద్ గుర్రంతో కలిసి సాహిత్యాన్ని అందించారు.

#Silakaa Lyrical Song | Pushpaka Vimanam Songs | Anand Deverakonda | Damodara | Ram Miriyala

చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ పాటలో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లోకి రానుంది.

More

Related Stories