ఆసుపత్రిలో చేరిన శింబు

- Advertisement -
Simbu


తమిళ యువ హీరో శింబు సడెన్ గా ఆసుపత్రిలో చేరాడు. వైరల్ ఫీవర్ వల్లే శింబు ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చిందని ఆ హీరో పీఆర్వో చెప్పారు. ఐతే, శింబుకి కరోనా సోకిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. వాటిని శింబు టీం తోసిపుచ్చింది. అతి జ్వరం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారని క్లారిటీ ఇచ్చింది టీం.

38 ఏళ్ల శింబు ఇటీవలే మంచి విజయం అందుకున్నాడు. ‘మనాడు’ అనే సినిమా రీసెంట్ గా విడుదలైంది. మంచి హిట్ అయింది. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత దక్కిన హిట్ అది.

ఒకప్పుడు ఎప్పుడూ తాగుతుండేవాడు. వ్యసనాల వల్ల కెరీర్ నాశనం అవుతోందని గ్రహించి…అన్నీ మానేశాడు. ఏడాది పాటు కష్టపడి ఫిట్నెస్ సంపాదించుకున్నాడు. స్లిమ్ గా తయారయ్యాడు. అవన్నీ ఫలితం చూపించాయి. మొత్తానికి విజయం దక్కింది. ఇక పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడట.

త్రిషతో పెళ్లి జరగనుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాలేదు.

 

More

Related Stories