తాగడం బంద్ చేశా: శింబు

- Advertisement -
Simbu

తమిళ హీరో శింబు ఒకప్పుడు ఆల్కహాల్ కి బానిస. పొద్దున్న లేవగానే బాటిల్ పట్టుకోవడమే. తాగుడుతో పాటు ఇతర వ్యసనాలు కూడా ఎక్కువే. వాటి వల్లే కెరీర్ మొత్తం నాశనం అయింది. ఒకప్పుడు అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నాడు శింబు. ఇప్పుడు అతనికి మార్కెట్ మొత్తం పోయింది.

దాంతో, అతను రెండేళ్లుగా తాగడం బంద్ పెట్టాడు. ఆ విషయాన్నీ తనే వెల్లడించాడు. శింబు నటించిన ‘మనాడు’ అనే సినిమా ఈ వీకెండ్ తమిళనాట విడుదల కానుంది. తెలుగులో కూడా దాన్ని “లూప్” పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో తాను తాగుడు మానేశానని చెప్పాడు.

హీరోయిన్లతో అఫైర్లకి కూడా దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు ఎక్కువే. నయనతారతో లవ్, ఆమెతో లిప్ లాకుల వీడియోలు లీక్ కూడా అయ్యాయి. హన్సికతో పెళ్లి ఫిక్స్ అయింది. ఎందుకో చివరి నిమిషంలో చెడింది. త్రిషతో డేటింగ్ సరేసరి. ఇవన్నీ బహిరంగంగా బయటికి వచ్చిన విషయాలు.

ఇప్పుడు శింబు మొత్తం మారిపోయాడు. ఫిజిక్ కూడా కంట్రోలోకి తెచ్చుకున్నాడు. లాక్డౌన్ టైంలోనే పరివర్తన వచ్చింది. బరువు కూడా డ్రాస్టిక్ గా తగ్గదు.

 

More

Related Stories