చాన్నాళ్ల తర్వాత సిమ్రాన్

ఒకప్పుడు సిమ్రాన్ తెలుగులో టాప్ హీరోయిన్. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అదీ కూడా తమిళ్ లోనే. తెలుగు దర్శకులు ఎందుకో ఆమెని అప్రోచ్ అవ్వడం లేదు.

ఐతే, ఇప్పుడు ఆమె ఒక కొత్త చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.

ఆది పినిశెట్టి హీరోగా ‘శబ్దం’ అనే సినిమా రూపొందుతోంది. ‘వైశాలి’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం ‘శబ్దం’. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఆది పినిశెట్టి ఇప్పటికే తెలుగులో హీరోగా, విలన్ గా నటించారు. విజయాలు అందుకున్నారు. ‘శబ్దం’ సినిమాలో సిమ్రాన్ కీలక పాత్ర పోషించనున్నారు.

లక్ష్మి మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సిమ్రాన్ కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తారట.

 

More

Related Stories