సింగీతంకి సతీవియోగం!


వెటరన్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు భార్య కన్నుమూశారు. ఆయన సతీమణి లక్ష్మి కళ్యాణి శనివారం రాత్రి కన్నుమూశారు.

“నా భార్య లక్ష్మి కళ్యాణి ఈ రోజు రాత్రి (శనివారం) 9 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల సుదీర్ఘమైన, ఘనమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది,” అని సింగీతం తన ఫేస్ బుక్ లో రాశారు.

ఎన్నో క్లాసిక్ చిత్రాలు తీసిన సింగీతం జీవితంలోనే కాదు, కెరీర్లో కూడా ఆయన భార్య లక్ష్మి కళ్యాణి పాత్ర ఉంది. సింగీతంకిప్పుడు 90 ఏళ్ళు. 28వ ఏళ్ల వయసులో ఆమెని పెళ్లాడారు.

సింగీతం శ్రీనివాస రావు సినిమా మేకింగ్ నుంచి రిటైర్ అయ్యారు. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ సినిమాకి మొదట కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు.

 

More

Related Stories