
ఆయన గొప్ప రైటర్. తమిళ సినిమా సాహిత్యంలో లెజెండరీ స్టేటస్ పొందిన కవి.. వైరముత్తు. ఐతే, ఆయన వ్యక్తిత్వంపై చాలా మరకలున్నాయి. అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన తనని లైంగికంగా వేధించారని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా కాలం క్రితమే ఆరోపించారు. అలాగే, అయన బాధితులు ఇంకా ఉన్నారంటూ మరికొందరి వర్ధమాన సింగర్స్ చాట్స్ ని తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు చిన్మయి.
వైరముత్తుకి వ్యతిరేకంగా చిన్మయి చేస్తున్న పోరు ఏళ్లుగా సాగుతూనే ఉంది. లేటెస్ట్ గా ఆయనికి ఒక అవార్డు రాకుండా సక్సెస్ అయ్యారు చిన్మయి.
ప్రతిష్ఠాత్మక ఓఎన్‌వీ కురుప్ అవార్డును వైరముత్తుకి ప్రకటించింది జ్యురీ. ఐతే ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఎలా ఇస్తారని సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది. దాంతో స్వయంగా వైరముత్తు ఆ అవార్డును తనకి ఇవ్వొద్దని జ్యురీకి విన్నవించాల్సి వచ్చింది. అలా, చిన్మయి ఈ ప్రముఖ రచయితకి చుక్కలు చూపిస్తోంది.