- Advertisement -

ప్రముఖ సింగర్ హరిణి రావు తండ్రి ఏ.కే.రావు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఏకే రావు హైదరాబాద్ వాసి. వారం క్రితం ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. సడెన్ గా ఆయన మృతదేహం బెంగుళూరు రైలు పట్టాలపై కనిపించింది. బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌కు ఏకే రావు చాలాకాలంగా సీఈవోగా పని చేస్తున్నారు. వారం రోజులుగా జాడలేకుండా పోయిన కుటుంబ సభ్యులు గురించి పోలీసులు గాలిస్తున్నారు.
ఏకే రావుది ఆత్మహత్య, హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట.
హరిణి హిందూస్తానీ గాయని. జ్యో అచ్యుతానంద చిత్రంలో “ఒక లాలన ఒక దీవెన” పాట పాడింది.