మంగ్లీ కారుపై రాళ్ల దాడి!

Mangli


తక్కువ టైంలో బాగా పాపులర్ అయిన గాయని మంగ్లీ. ఆమె తెలంగాణ పాటలు పాడి బాగా పాపులర్ అయ్యారు. ఇక సినిమాల్లో ‘రాములో రాములా’ వంటి పాటలు ఆమెకి స్టార్డంని తెచ్చిపెట్టాయి. దాంతో, ఆమెని పలు ఈవెంట్స్ కి అతిథిగా, గాయనిగా పిలుస్తున్నారు.

అలా ఆమె నిన్న రాత్రి బళ్లారి ఫెస్టివల్ కి అటెండ్ అయింది. తిరిగి వస్తుండగా మంగ్లీ కారుపై దాడి జరిగింది అని సమాచారం. కొందరు యువకులు రాళ్లు రువ్వటంతో ఆమె కారు అద్దాలు పగిలినట్లు సమాచారం.

ఆమెని చూసేందుకు కుర్రకారు ఎగబడ్డారట. ఐతే, ఆమె మేకప్ రూమ్ నుంచి ఎంతకూ బయటికి రాకపోవడంతో ఆమె తిరిగి వెళ్తున్నప్ప్పుడు కొందరు కుర్రాళ్లు రాళ్లదాడి చేశారు.

రాయలసీమ ప్రాంతానికి చెందిన మంగ్లీ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక ఆమె గాయనిగా తెలంగాణ యాసలో పాటలు పాడి పాపులర్ అయ్యారు.

 

More

Related Stories