- Advertisement -

ఇండియన్ ఐడల్ 9 విన్నర్ గా నిలిచిన ఆంధ్ర కుర్రాడు రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ యువ గాయకుడు గుంటూరుకి చెందిన అన్వితని పెళ్లాడాడు. కరోనా కాలంలో సాంప్రదాయపద్దతిలోనే సింపుల్ గా నిర్వహించారు వివాహ వేడుకలు.
రేవంత్ ఇటీవల తెలుగులో చాలా హిట్ సాంగ్స్ పాడారు. “గీత గోవిందం”లో “వాట్ ది లైఫ్”, “ఆచార్య”లో “సాన కష్టం”, “సీటిమార్” టైటిల్ సాంగ్ వంటివి ఆయన పాడిన లేటెస్ట్ పాపులర్ గీతాలు.
గతేడాది డిసెంబర్ లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. రేవంత్ పలు టీవీ షోలు కూడా చేశాడు.