
రామ్ సూరపనేనితో నిశ్చితార్థం జరిగింది అని సోషల్ మీడియాలో ఎలా ఆఫీసియల్ గా చెప్పానో, పెళ్లి గురించి కూడా తానే చెప్తాను అంటున్నారు సింగర్ సునీత. పెళ్లి డేట్ గురించి మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె ప్రతిస్పందన ఇది.
సునీతకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందం అలాంటిది. 43 ఏళ్ల వయసులో ఆమె రెండో పెళ్ళి చేసుకుంటోంది. అందుకే జనంలో ఇంత ఆసక్తి. ఐతే, మీడియా ప్రచారం ఆమెకి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నట్లుంది. “పెళ్లి డేట్ గురించి ఏది పడితే రాయకండి. నేనే చెప్తా….” అంటూ తాజాగా మీడియా ప్రతినిధులను కోరారు.
ఇటీవల రామ్, సునీత దిల్ రాజు 50వ బర్త్ డే పార్టీకి కలిసి వచ్చారు.
రామ్… దిల్ రాజుకి సంబందించిన అన్ని సినిమాల శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అమ్మకాలు చేసేదంతా రామ్. దిల్ రాజు కాంపౌండ్ మనిషి. రామ్, సునీత పెళ్లి చేసుకోవాలనుకోవడానికి దిల్ రాజు, ఆయన కూతురు ప్రోద్బలం కూడా ఒక కారణం అనేది ఒక టాక్.