‘మోసాలు చూశా, బాధలూ పడ్డా’

- Advertisement -


గాయని సునీత కొడుకు హీరోగా అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆమె తన కొడుకుని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలాగే తన లైఫ్ లో ఎదురుకున్న కష్టాలు, చూసిన నష్టాల గురించి కూడా ఏకరవు పెట్టింది.

ఆమె ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భర్త వల్ల ఆమెకి ఇద్దరు పిల్లలు. ఐతే, అప్పుడు ఆనందంగా లేనని, ఎక్కువ బాధలు పడ్డాను అని అంటున్నారు. పిల్లలను చూసుకుంటూ, కెరీర్ ని కాపాడుకుంటూ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడంలోనే జీవితం గడిచింది అని అంటున్నారు.

లైఫ్ లో కష్టాలతో పాటు మోసాలూ కూడా ఎక్కువే చూశాను అంటోంది. ఆమెని డబ్బు పరంగా చాలా మోసం చేశారట. తాను సంపాదించిన దాంట్లో బోలెడంత డబ్బు అలా పోయిందట.

రెండో పెళ్లితో అంతా బాగా జరిగింది అని, ఇది గొప్ప నిర్ణయమని చెప్తున్నారు.

 

More

Related Stories