
ప్రేమపక్షులు దీప్తి సునైన, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పుకున్నారు. 2022 మొదటి రోజే దీప్తి, షణ్ముఖ్ సోషల్ మీడియాలో తాము ఎవరి దారి వారిది చూసుకుంటున్నట్లు రాసుకున్నారు. 5 ఏళ్ల వీరి లవ్ స్టోరీలో విలన్ ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 5 షో చూసిన వారు సిరి హన్మంత్ వైపు ఫింగర్స్ చూపిస్తున్నారు. నిజంగా సిరి వల్లే వీరి బ్రేకప్ జరిగిందా?
సిరి హన్మంత్, షణ్ముఖ్ మధ్య బిగ్ బాస్ లో కొంత ప్రేమాయణం నడిచిన మాట నిజమే. ఐతే, ప్రోగ్రాం అవతల కూడా వీరి మధ్య అఫైర్ ఉందా అనేది ప్రశ్న. సిరి మాత్రం అలాంటిదేమి లేదని చెప్తోంది. షణ్ముఖ్ మాత్రం నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు.
షణ్ముఖ్ కి యూట్యూబ్ సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది. వైజాగ్ కి చెందిన ఈ కుర్ర నటుడు దీప్తితో బ్రేకప్ గురించి కూడా స్పందించాడు. ఆమెకి లైఫ్ లో అంతా మంచి జరగాలి అన్నట్లుగా రాసుకున్నాడు. సిరి హన్మంత్ ఈ మొత్తం ఎపిసోడ్ లో సైలెంట్ గా ఉంది.

‘బిగ్ బాస్ తెలుగు’ ఇప్పటివరకు 5 సీజన్లు పూర్తి చేసుకొంది. ప్రతి సీజన్ లో రొమాంటిక్ స్టోరీలు నడిచాయి. ఐతే, అవన్నీ షో వరకే. ఆ తర్వాత వాటిని ఎవరూ పొడగించలేదు. రాహుల్ సిప్లిగంజ్, పునరవి కూడా లవ్ స్టోరీ నడిపించారు షోలో. కానీ బయట మాత్రం మంచి ఫ్రెండ్స్ గానే మిగిలిపోయారు. అంతే. తొలిసారిగా షో లో జరిగిన రొమాన్స్ యాక్టింగ్ వల్ల నిజ జీవితంలో ఒక జంటకి బ్రేకప్ జరిగింది.