కరీనా వద్దు, కంగనా కావాలి!

Kangana and Kareena

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా బాలీవుడ్ లో ‘సీత’ అనే భారీ చిత్రం రూపొందనుంది. రామాయణ గాథని సీతమ్మ వారి కోణంలో చూపించే ప్రయత్నం ఇది. ‘సీత’ పాత్ర ఎవరు పోషించాలి? ముందుగా దీపిక పదుకోన్ ఐతే బాగుంటుంది అనుకున్నారు. కానీ చివరికి దర్శక, నిర్మాతలు కరీనా కపూర్ కి ఫిక్స్ అయ్యారట. ఐతే, ఆమె ఆ పాత్ర పోషించేందుకు 12 కోట్లు అడిగటంతో షాక్ తినడం నిర్మాతల వంతు అయింది.

ఈ వార్త ఇటీవల బాగా వైరల్ అయింది. దాంతో, కరీనాని సోషల్ మీడియా జనం తెగ ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. ‘సీత’ పాత్ర పోషించే అవకాశం వస్తే కళ్ళు మూసుకొని ఒప్పుకోవాలి… అలాంటి డిమాండ్స్ ఏంటి అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాదు, కరీనా లాంటి హీరోయిన్ బదులు అసలు సిసలు ‘హిందూ నారి’ కంగనా రనౌత్ ని తీసుకొండి అంటూ ఉచిత సలహా కూడా మేకర్స్ కి ఇస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో రాముడిగా ఎవరు నటిస్తారనేది కూడా ఇంకా తేలలేదు. రాముడిది గెస్ట్ రోలే ఇందులో. కథ అంతా సీతమ్మవారి కోణంలో నడుస్తుంది.

 

More

Related Stories