సాయి పల్లవి కాకపోతే జాన్వీ

- Advertisement -
Janhvi Kapoor and Sai Pallavi

బాలీవుడ్ లో భారీ ఎత్తున రామాయణం తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటించనున్నారు. ఇక సీతమ్మ పాత్రలో సాయి పల్లవి బాగుంటుంది అని భావిస్తున్నారు.

ఐతే, సాయి పల్లవి ఇంకా సైన్ చెయ్యలేదు. ఒకవేళ సాయి పల్లవి కాకపోతే మరి ఎవరు? జాన్వీ కపూర్ ఐతే బాగుంటుంది అని నిర్మాత ఆలోచన. కానీ దర్శకుడు మాత్రం సాయి పల్లవిని సీత పాత్రలో చూపించాలని పట్టుదలగా ఉన్నారు అని టాక్.

ఈ రామాయణం షూటింగ్ ఈ ఏడాదే మొదలవుతుంది. రణబీర్ కపూర్ రాముడిగా నటించాలని ఉత్సహంగా ఉన్నారట.

జాన్వీ కపూర్ పర్సనాలిటీకి సీత పాత్ర సూట్ అవదు. సాయి పల్లవి అద్భుతమైన నటి. కానీ ఆమె సీతగా బాగుంటుందా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. మరి చివరికి ఎవరు సీతగా సెట్స్ లోకి అడుగుపెడుతారో చూడాలి.

 

More

Related Stories