సితార క్లాసికల్ డ్యాన్స్


మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికే యూట్యూబ్ సెలెబ్రెటీగా, ఇన్ స్టాగ్రామ్ సెలెబ్రెటీగా పేరు తెచ్చుకొంది. దాదాపు 9 లక్షల మంది ఫాలోవర్స్ కూడా వచ్చారు. ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టడం ఖాయం.

సితారకి అన్ని కళల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు ఆమె తల్లితండ్రులు. దీపావళి సందర్భంగా ఆమె తాజాగా క్లాసికల్ డ్యాన్స్ వీడియోని విడుదల చేసింది. తన గురువు మహతి భిక్షుతో కలిసి ఆమె సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసింది.

మహేష్ బాబు గర్వంతో తన కూతురు వీడియోని షేర్ చేశారు. తల్లి నమ్రత కూడా సితారని చూసి గర్వపడుతున్నట్లు కామెంట్ పెట్టారు.

సితారకిప్పుడు 8 ఏళ్ళు.

 

More

Related Stories