‘థియేటర్లో చూడాల్సిన సినిమా సీతారామం’

దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతారామం’. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ప్రభాస్

“సీతారామం ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. దుల్కర్ సల్మాన్ హ్యాండ్ సమ్ హీరో, సూపర్ స్టార్. మహానటి లాంటి గ్రేట్ ఫిల్మ్ లో చేశారు. మృణాల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. అలాగే రష్మిక డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. ఒక ప్రేమ కథని ఇంత భారీగా తీయడం మామూలు విషయం కాదు. స్వప్న లాంటి ప్యాషన్ వున్న నిర్మాతతోనే ఇది సాధ్యపడుతుంది. హను గారు అద్భుతమైన దర్శకుడు. అశ్విన్ దత్ గారు లాంటి గొప్ప నిర్మాత తెలుగులో వుండటం మా అదృష్టం. ‘సీతారామం’ థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఇంట్లో పూజగది వుందని గుడికి వెళ్ళడం మానేస్తామా? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా అందరూ థియేటర్ లోనే చూడాలి.

దుల్కర్ సల్మాన్

ప్రభాస్ గారు ఈ ఈవెంట్ కి రావడం ఎంతో ఆనందంగా వుంది. సీతారామం గ్రేట్ జర్నీ. స్వప్న దత్ వండర్ విమెన్. అశ్విన్ దత్ గారు నా ఫేవరేట్ పర్శన్. నాపై ఎంతో వాత్సల్యం చూపిస్తారు. హను రాఘవపూడి గొప్ప ప్యాషన్ వున్న దర్శకుడు. సీతారామం చాలా స్పెషల్ ఫిల్మ్.

నిర్మాత స్వప్న

ప్రభాస్ గారికి స్పెషల్ థాంక్స్. ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి.. మా కోసం వచ్చారు. రెండు.. సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు. హను వండర్ ఫుల్ ఫిలిం మేకర్. దుల్కర్, మృణాల్, సుమంత్, రష్మిక .. అందరికీ థాంక్స్. ఇలాంటి సినిమాలు తీయడం మామూలు విషయం కాదు. నాన్నగారి వలనే ఇది సాధ్యమైయింది.

 

More

Related Stories