కొరటాల ‘హెయిర్’ చేయించుకున్నారట!

- Advertisement -
Siva Koratala


దర్శకుడు కొరటాల శివకి బట్టతల ఉందని చెప్పక్కర్లేదు. ఎదో సినిమాలో వెంకటేష్ అన్నట్లు అరెకరం ఎప్పుడో పోయింది. ఎప్పుడూ తన బట్టతలతోనే కనిపించేవారు. ఐతే, ఈ రోజు (జూన్ 15న) ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఫోటోలలో ‘తేడా’ స్పష్టంగా కనిపిస్తోంది.

‘సైడ్’లు ఇప్పుడు జుత్తుతో కవరయ్యాయి. మునుపటి కన్నా నిండుగా ఉంది ఆయన హెయిర్ స్టైల్. ఈ కొత్త లుక్ ని చూసిన వారికి కలిగే మొదటి అనుమానం ఒక్కటే: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారా?

చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏ మాటకు ఆ మాట, శివ కొరటాల ఇప్పుడు యంగ్ తరంగ్ లా ఉన్నారు. ‘ఆచార్య’ సినిమాకి దర్శకుడు ఆయన.

మెగాస్టార్ చిరంజీవి తన ‘ఆచార్య’ దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెరైటీగా చెప్పారు.

“ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. #Acharya సృష్టికర్త siva koratala కి జన్మదిన శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు చిరంజీవి.

 

More

Related Stories