
“ఖుషి” సినిమా విడుదలైంది. మంచి టాక్ తో రన్ అవుతోంది. ఐతే, ఈ సినిమాని పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం చిత్రీకరించారు. అలాగే సినిమాలో సెంటిమెంట్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ మధ్య కిస్ సీన్లు అవసరమా అన్న కామెంట్ కి దర్శకుడు శివ నిర్వాణ సమాధానం ఇచ్చారు.
“సినిమా కథకి ముద్దు సీన్లు అవసరం. పెళ్లి, పిల్లలు, సంసారం చుట్టూ తిరిగే కథ చెప్పినప్పుడు వారి మధ్య ఇంటిమసీ, ప్రేమ చూపించాలి కదా. రెండు ముద్దు సీన్లు కథకు అవసరం,” అన్నారు శివ నిర్వాణ.
“ఖుషి” మూవీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలుగా నటించారు సమంత, విజయ్ దేవరకొండ.
ఇక సినిమా లెంగ్త్ విషయంలో వస్తున్న కామెంట్స్ పై కూడా వివరణ ఇచ్చారు శివ నిర్వాణ. “సినిమాలో చివరి 20 నిమిషాల ఎమోషనల్ సీన్ ముఖ్యం. సినిమా ఎమోషనల్ గా ఉందని ఇప్పుడు అంటున్నారు అంటే కారణం ఆ ఎమోషన్ రావడానికి ఆ మాత్రం లెంగ్త్ కావాలి,” అని సమాధానం ఇచ్చారు.