మార్చి 25 నుంచి జెమినిలో ‘సివంగి’

Sivangi

“సివంగి” అనే సరికొత్త సీరియల్ ప్రసారం కానుంది. మార్చి 25 నుంచి ఇది స్టార్ట్ అవుతోంది.

ఇది ఒక అమ్మాయి కథ. పేద కుటుంబానికి చెందిన ఒక పల్లెటూరి అమ్మాయి ఆనంది ఈ సీరియల్ కథానాయిక. ఊళ్ళో ఎవరికీ ఏ కష్టం వచ్చినా, సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అలాంటి ఆనంది ఇంటి బాధ్యతల నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆమె తన ఊరు తిరిగి వెళ్లగలుగుతుందా? అనేది కథలో మెయిన్ పాయింట్.

జెమిని టివిలో ఈనెల 25న ప్రారంభం సాయంత్రం 7.30 గంటలకు ప్రసారం అవుతుంది ‘సివంగి’.

ఈ సీరియల్లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్, శ్రీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు.

More

Related Stories