- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తర్వాత గత వారమే తిరిగి తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు తెరుచుకున్నాయి. వెంటనే ఐదు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. అన్ని ఢమాల్. అయినా… ఈ వీకెండ్ కూడా మరో అరడజను చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
‘రాజా వారు రాణి వారు’ అనే సినిమాతో పరిచయమైన కిరణ్ అబ్బవరం హీరోగా ‘SR కల్యాణమండపం’ అనే సినిమా రూపొందింది. ఈ అర డజన్ చిత్రాల రాకలో ఇదొక్కటే కాస్త చెప్పుకోతగ్గది.
ఇక రేపు రిలీజ్ కానున్న ఇతర చిత్రాలు… “ఇప్పుడు కాక ఇంకెప్పుడు”, “మ్యాడ్”, “ముగ్గురు మొనగాళ్లు”, “మెరిసే మెరిసే”, “క్షీరసాగర మధనం”. ఒక్కటీ కూడా తెలిసిన ముఖాలున్నవి కావు. మరి ఈ చిత్రాలకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఏ సినిమా జాతకం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. మరి ఇందులో ఏదైనా కలెక్షన్ల ఊపు తెస్తుందా?