సియా గౌతమ్ కొత్త చిత్రం!

Siya Gautam

సియా గౌతమ్ గుర్తుందా? కొన్నేళ్ల క్రితం ఆమె పేరు మార్మోగింది. తన ఒంపుసొంపులతో ఆకట్టుకున్న ఈ భామ ‘నేనింతే’ సినిమాతో పాపులారిటీ పొందింది.

చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో మరో సినిమా చేస్తోంది. అది కూడా లేడి ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్తున్నారు మేకర్స్. జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీని లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మరో మహా భారతం టైటిల్ ను ఖరారు చేశారు.

దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది.

 

More

Related Stories