రోజుకో సినిమా డేట్ మారుతోంది. ఇంతకుముందు ప్రకటించిన సినిమాల డేట్స్ అన్నీ మారిపోయాయి. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన “సలార్” తప్పుకోవడంతో ఇలా అన్ని సినిమాలు మాటిమాటికీ డేట్స్ మార్చేస్తున్నాయి. తాజాగా వాయిదా పడిన చిత్రం.. చంద్రముఖి 2.
సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన “చంద్రముఖి 2” రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 28న రానుంది. దీనివల్ల పెద్ద ఇబ్బందే.
ఇప్పటికే అదే రోజు మూడు, నాలుగు చిత్రాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది… స్కంద. ఐతే, రామ్ పోతినేని – బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ‘స్కంద’ హైప్ ముందు ‘చంద్రముఖి 2’ నిలవదు. తెలుగులో ‘స్కంద’కే ఇంపార్టెన్స్. కానీ ఇతర చిన్న చిత్రాలు “మ్యాడ్”, “పెద్ద కాపు 1” వంటివి వాయిదా బాట పట్టక తప్పదు.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ 28న ‘స్కంద’, చంద్రముఖి 2′, ‘రూల్స్ రంజాన్’ పోటీపడనున్నాయి. మిగతావి డౌటే.