ఆ ప్రకటన కోసమే స్కంద నిరీక్షణ

Skanda



“సలార్” సినిమా వాయిదా పడింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” ఆ డేట్ నుంచి తప్పుకొంది. దాంతో ఆ డేట్ కి తమ సినిమాని ఫిక్స్ చెయ్యాలని “స్కంద” నిర్మాత ఫిక్స్ అయ్యారు. ఐతే, ఇంకా ప్రకటన చెయ్యడం లేదు.

రామ్ హీరోగా బోయపాటి తీస్తున్న “స్కంద” సెప్టెంబర్ 15న విడుదల కావాలి. ఐతే, “సలార్” వాయిదా వేసినట్లు ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన తర్వాతే తమ సినిమా డేట్ సెప్టెంబర్ 28 అని పోస్టర్ విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు రామ్ చిత్ర నిర్మాతలు.

“సలార్” వాయిదా పడింది అని ఇప్పటివరకు మీడియాలోనే వార్తలు. ఆ చిత్ర నిర్మాతల నుంచి ప్రకటన రాలేదు. వారు ఆ లాంఛనం కూడా పూర్తి చేస్తే తాము అధికారికంగా కొత్త డేట్ (సెప్టెంబర్ 28)ని ప్రకటిస్తాం అంటున్నారు “స్కంద” మేకర్స్.

“స్కంద” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్, బోయపాటి కలయికలో మొదటి చిత్రం కావడం ఒక కారణం. రామ్ పోతినేని, శ్రీలీల కాంబినేషన్ కావడం మరో రీజన్. ఇప్పటికే ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి వ్యాపారం జరిగింది. ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఐతే, సెప్టెంబర్ 28న విడుదల చేస్తే వరుసగా ఐదు రోజుల ఓపెనింగ్ కలిసొస్తుంది అని టీం భావిస్తోంది.

Advertisement
 

More

Related Stories