బేబీ తర్వాత కల్ట్ బొమ్మ!

- Advertisement -
SKN

“బేబీ” సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం. ఈ సినిమాని జనాలు “కల్ట్ బొమ్మ” అంటూ మెచ్చుకొని తెగ చూశారు. “యానిమల్” సినిమాకి కూడా అలాంటి ట్యాగ్ వచ్చింది.

అందుకే యువ నిర్మాత ఎస్ కె ఎన్ (SKN) ఈ క్యాచీ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. 

సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా తీస్తున్నారు ఆయన. అలాగే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా మరో సినిమా ప్రొడక్షన్ లో ఉంది. మరి ఈ కల్ట్ బొమ్మ అనే టైటిల్ ఏ సినిమాకు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

టైటిల్ ఐతే క్యాచీ గా ఉంది. “కల్ట్ బొమ్మ” అనే పేరు పెట్టారు అంటే సినిమా కూడా కల్ట్ గానే ఉంటుంది అనుకోవచ్చు. మరి “బేబీ” కల్ట్ బొమ్మ అయినట్లు ఈ కల్ట్ బొమ్మ నిజంగానే కల్ట్ అవుతుందా అన్నది చూడాలి.

 

More

Related Stories